Header Banner

అఖిల్ - జైనాబ్ పెళ్లి రిసెప్షన్.. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల రాక!

  Sun Jun 08, 2025 22:42        Entertainment

అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి కొనసాగుతోంది. యువ కథానాయకుడు అక్కినేని అఖిల్, జైనాబ్‌ల వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై అఖిల్, జైనాబ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు మహేశ్‌బాబు తన అర్ధాంగి నమత్రతో కలిసి విచ్చేయగా, తమిళ స్టార్ హీరో సూర్య, యువ దర్శకుడు వెంకీ అట్లూరి తదితరులు కూడా ఈ వేడుకలో పాలుపంచుకుని నవ దంపతులకు తమ ఆశీస్సులు అందించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన, నాని, నిఖిల్, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు సానా తదితరులు కూడా విచ్చేశారు. 

 

ఇది కూడా చదవండి: ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..

 

వీరితో పాటు మరికొంతమంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఈ వివాహ విందులో పాల్గొని సందడి చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణం ప్రముఖుల రాకతో కళకళలాడింది. అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అఖిల్, జైనబ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఆకర్షణీయమైన ఫోటోలను అన్నపూర్ణ స్టూడియోస్ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోగా, అవి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ నెల 6వ తేదీన, శుక్రవారం నాడు, అఖిల్, జైనాబ్‌ల వివాహం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నాగార్జున నివాసంలో నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహానంతరం ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్ వేడుకకు పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Akhil Akkineni #Akhil Zainab #Wedding #Revanth Reddy #Akkineni Family #Nagarjuna #Mahesh Babu #Tollywood #Hyderabad #Reception #Annapurna Studios #Venkataiah Naidu